Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసక్తిని రేపుతోన్న 'సీత' ట్రైలర్

  • కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'
  • ప్రతినాయకుడిగా సోనూసూద్
  •  ఈ నెల 24వ తేదీన విడుదల
తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆమె జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. ఇక ప్రతినాయకుడిగా సోనూసూద్ కనిపించనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 'నా పేరు సీత .. నేను గీసిందే గీత' అనే ఒకే ఒక్క కాజల్ డైలాగ్ తో ఆమె పాత్ర స్వభావం ఎలాంటిదో చెప్పేశారు. 'రావణాసురుడు .. సీతాదేవిని తీసుకెళ్లడం తప్పుకాదు .. రాముడి భార్యను తీసుకెళ్లడం తప్పు' అనే హీరో డైలాగ్ తో కథ ఏ దిశగా నడుస్తుందనేది చెప్పేసి ఆసక్తిని పెంచారు. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే కథ సినిమాకి హైలైట్ కానున్నట్టుగా తెలుస్తోంది. కాజల్ కి ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.
kajal
bellamkonda

More Telugu News